వైభవంగా కొండగట్టులో జ్యేష్ఠాభిషేకం

కొండగట్టు, వెలుగు:    కొండగట్టు ఆలయంలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. 108 కలశాలను  సుగంధవ్యాలతో నింపి ప్రత్యేక పూజలు  చేశారు. ఆనంతరం  మూలవిరాట్ కు అభిషేకం నిర్వహించారు. ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామి వారి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రాన్ని  పురస్కరించుకొని  ఈ వేడుకలు నిర్వహిస్తారు.  

ఎండలు పోయి వర్షాలు రావాలని...  అతివృష్టి, అనావృష్టి  ఉండొద్దని ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, స్థానాచార్యుడు కపిందర్, ఆలయ ఈవో చంద్రశేఖర్, సూపరిండెంటు  శ్రీనివాస శర్మ, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.