కొండాపూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి : జువ్వాడి నర్సింగరావు

మెట్ పల్లి, వెలుగు: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్  ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుట్ల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు సూచించారు. బుధవారం వరద ప్రవాహానికి కొట్టుకపోయిన తాత్కాలిక రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

నాసిరకంగా పనులతో చేపట్టిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు గూడా శ్రీకాంత్ రెడ్డి, దుదిగం గంగాధర్, ఎలాల జలపతి రెడ్డి, బాస శ్రావణ్, క్యాతం తిరుపతి రెడ్డి, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.