గురుకులంలో మెరుగైన వసతులు కల్పించాం : జువ్వాడి నర్సింగరావు

మెట్ పల్లి, వెలుగు: పెద్దాపూర్ గురుకుల స్కూల్‌‌‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో మెరుగైన వసతులు కల్పించామని, పేరెంట్స్‌‌‌‌ తమ పిల్లలను పంపించాలని కాంగ్రెస్‌‌‌‌ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన పెద్దాపూర్ గురుకులం స్కూల్‌‌‌‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో స్కూల్‌‌‌‌లో జరిగిన సంఘటనలు పేరెంట్స్‌‌‌‌, విద్యార్థులను భయాందోళనకు గురిచేశాయన్నారు. గురుకులంలో ఇద్దరు పిల్లలు చనిపోవడాన్ని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, కేబినేట్‌‌‌‌ తీవ్రంగా పరిగణించారని, స్వయంగా డిప్యూటీ సీఎం వచ్చి పరిస్థితులపై ఆరా తీసి, మౌలిక వసతుల కల్పనకు రూ.50లక్షలు మంజూరు చేశారన్నారు. బుధవారం నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం కానున్నాయని అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరూ హాజరుకావాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాధవీలత, టీచర్లతో సమావేశమయ్యారు. లీడర్లు ఆకుల లింగారెడ్డి, అంజిరెడ్డి, అన్నం అనిల్, శీలం వేణు, లక్ష్మణ్‌‌‌‌, జెట్టి లింగం పాల్గొన్నారు.

కోరుట్ల: కోరుట్లలోని జువ్వాడి భవన్‌‌‌‌లో 10 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌ చెక్కులను నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ, బ్లాక్​ అధ్యక్షులు తిరుమల గంగాధర్, సత్యనారాయణ, నయీమ్ , ఏఎంసీ చైర్మన్ అంజిరెడ్డి, వైస్​చైర్మన్​ వెంకటేశ్‌‌‌‌, మహిపాల్ రెడ్డి,  కౌన్సిలర్ నాగభూషణం, లీడర్లు పాల్గొన్నారు.