మల్లాపూర్ , వెలుగు: 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కోరుట్ల నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని, అందరికీ సేవ చేస్తానని కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో సుమారు 800మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి , కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జలపతి రెడ్డి, గ్రామ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ పుష్పలత, లీడర్లు బాపురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.