ఆరు గ్యారంటీలతో అందరికీ న్యాయం : జీవన్‌‌‌‌రెడ్డి

సిరికొండ, వెలుగు: ఆరు గ్యారంటీలతో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని నిజామాబాద్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ జీవన్‌‌‌‌రెడ్డి చెప్పారు. సోమవారం సిరికొండలో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పదేళ్లు పాలించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్‌‌‌‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గ్రహించారు కాబట్టే పట్టం కట్టారన్నారు. తాను గెలిచిన తర్వాత ఏడాదిలోనే 21వ ప్యాకేజీ ద్వారా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఐదేళ్లు ఎంపీగా ఉన్న అర్వింద్‌‌‌‌ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్‌‌‌‌ చేశారు. తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌‌‌‌లో చేరగా వారికి జీవన్‌‌‌‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో రూరల్‌‌‌‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీమంత్రి బోధన్‌‌‌‌ ఎమ్మెల్యే సుదర్శన్‌‌‌‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌‌‌‌ తహేర్‌‌‌‌ బిన్‌‌‌‌ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర సభ్యుడు నగేశ్‌‌‌‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌‌‌‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెల్మ భాస్కర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.