స్మార్ట్ ఫోన్ మీ ఆరోగ్యానికి, జీవితానికి హానికరం: సిగరెట్లపై మాదిరే ఇక నుంచి ఫోన్లపై లేబుల్

ఇటీవల ప్రతి పేరెంట్స్ కంప్లయింట్ ఒక్కటే.. మా అబ్బాయి సెల్ ఫోన్ బాగా చూస్తున్నాడు.. మా అమ్మాయి సెల్ ఫోన్ ఇస్తే అన్నం తింటుంది.. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని.. ఇది ప్రతి  ఇంట్లో ఇప్పుడిది ఓ పెద్ద సమస్య.. ఇంట్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పిల్లలు సెల్ ఫోన్లు చూడటంపై ఆందోళన మొదలైంది..  ఏకంగా కొన్ని దేశాలు సోషల్ మీడియా బ్యాన్ చేశాయి. పిల్లలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై బ్యాన్ చేస్తున్నాయి.  అంతేకాదు స్మార్ట్ ఫోన్ వినియోగం పెద్దల్లో కూడా ఆరోగ్యానికి , మరీ శృతిమించితే జీవితానికే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

స్మార్ట్ఫోన్ వ్యసనం..మోడర్న్ లైఫ్లో ఇదో పెద్ద సవాల్గా మారింది..నిద్ర, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది..ముఖ్యంగా యువతలో.. స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని పబ్లిక్ హెల్త్ ఎపిడెమిక్ గా తీసుకున్న స్పెయిన్ ఏకంగా స్మార్ట్ ఫోన్ వాడకంపై సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్లలో హెల్త్ వార్నింగ్ అవసరం.. ఈ చర్యతోనైనా అధిక స్క్రీన్ సమయం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన పెంచడం , జాగ్రత్తగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోందట. 

స్మార్ట్ ఫోన్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరం అంటూ.. సిగరెట్ పెట్టెలపై ఎలా వార్నింగ్ గుర్తులను వేస్తున్నారో..అలాగే స్మార్ట్ ఫోన్లపై కూడా అలాగే వార్నింగ్ మేసేజ్ లు, గుర్తులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పెడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంపై ఆందోళన చెందుతున్న  స్పెయిన్ దేశ ప్రభుత్వం ఏకంగా స్మార్ట్ ఫోన్లపై వార్నింగ్ లేబుల్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. 

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం  బాగా పెరిగిపోయింది. ప్రతి పనికి సెల్ ఫోన్లపై ఆధారపడటం అలవాటైపోయి .. సెల్ ఫోన్ లేకుండా ఉండలే అనే స్థాయికి ఎడిక్ట్ అవుతున్నారు.దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో కొన్ని దేశాలు సెల్ ఫోన్ల వాడకం,  నియంత్రణపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా స్పెయిన్ ప్రభుత్వం  ఓ నిపుణులు కమిటీని వేసింది. కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలకు సిద్దమవుతోంది. 

ALSO READ : పేరంట్స్ కేర్ : పిల్లల ఎదుట మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే వాళ్ల భవిష్యత్ నాశనం చేసినోళ్లు అవుతారు

స్మార్ట్ ఫోన్ల వాడకం, నియంత్రణపై నిపుణుల కమిటీ 250 పేజీల రిపోర్టును స్పెయిన్ ప్రభుత్వానికి అందించింది. రిపోర్టు ప్రకారం..సిగరెట్ పెట్టెలపై ఎలా ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలు ఇస్తున్నారో.. అలాగే స్మార్ట్ ఫోన్లపై కూడా తప్పనిసరిగా హెల్త్ కన్సర్న్ వార్నింగ్ లేబుల్స్ వేయాలని సూచించింది.

అంతేకాదు.. చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడకుండా కంప్లీట్ గా బ్యాన్ చేయాలని సూచించింది. ఆరేళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లు చూడనివ్వకూడదు.. ఆరేళ్ల నుంచి 16 లోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్ లో యాప్ ల వాడకం తగ్గించాలని .. అనవసర కంటెంట్ ఉన్న యాప్ లకు పిల్లలను దూరంగా ఉంచాలని.. లేకుంటే పిల్లలపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని  కమిటీ హెచ్చరించింది. 

ALSO READ : ఐకూ 13 స్మార్ట్​ఫోన్​ వచ్చేసింది.. స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో..

ఎడ్యుకేషన్ కు సంబంధించిన కొన్ని రకాల ఫీచర్లతో కూడిన యాప్ ల వినియోగాన్ని కూడా కమిటీ తప్పుబట్టింది. పిల్లల చదువులపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అటువంటి యాప్‌లను తీసివేయాలని , బదులుగా చిన్న విద్యార్థుల కోసం అనలాగ్ బోధనా పద్ధతులను అనుసరించాలని కోరింది. 
టెక్నాలజీ , సాంప్రదాయ పరంగా అభ్యసనాల మధ్య సమతుల్యత ఉండాలంటే ప్రారంభ దశలో డిజిటల్ ఎక్విప్ మెంట్లు వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. 

మానసిక ఆరోగ్యం, విద్య , వారి శ్రేయస్సుపై టెక్నాలజీ ప్రభావం, ప్రయోజనాలను బ్యాలెన్స్ చేయడం కోసం డిజిటల్ వినియోగానికి సమగ్ర విధానం అవసరమని నిపుణుల కమిటీ ప్రతిపాదనలు నొక్కి చెబుతున్నాయి.