humanoid robot: హ్యుమనాయిడ్ రోబోట్..మనిషికున్నట్లే హార్ట్ బీట్.. చేతిసంజ్ణలు చేస్తుంది

హ్యుమనాయిడ్ రోబోట్..మనిషికున్నట్లే హార్ట్ బీట్.. చేతిసంజ్ణలు చేస్తుంది..61 భాషల్లో సమాధానాలు చెబుతుంది.. చీర కడితే అంచ్చం ఇండియన్ లేడీలా కనిపిస్తుంది. ఇండియాలో ప్రతిభకు కొదవలేదని.. హ్యుమనాయిడ్ రోబోట్ ను చూస్తే తెలిసిపోతుంది.. 

వేదిక్ ప్రిన్సిపుల్స్ తో ప్రేరణ పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులు.. వాడి పడేసిన వస్తువులతో ఏకంగా హార్ట్ బీట్ ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్  ను తయారు చేశారంటే వారి టాలెంట్ ను మెచ్చుకోవాల్సిందే..తక్కువ ధర,  ఎక్కువ ఫలితాలను ఈ రోబోట్ ద్వారా పొందేలా రూపొందించారు ఉత్తరప్రదేశ్ లోని కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(KIET) ఇంజనీరింగ్ స్టూడెంట్స్.. 

ఈ హ్యూమనాయిడ్ రోబోట్ పేరు అనుష్క..ఈ రోబోట్ను KIET ఇంజనీరింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్ కలిసి కేవలం 2లక్షల ఖర్చుతో తయారు చేశారు. ఇతర రోబోట్ మోడళ్లతో పోలిస్తే..చాలా తక్కువ ఖరీదు. 

అనుష్క పనేంటంటే.. గెస్ట్ లకు వెల్కమ్ చెబుతుంది.ఏవైనా సమస్యలుంటే సమాధానం చెబుతుంది. కావాల్సిన సహాయం చేస్తుంది. అయితే ఈ రోబోట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుస్తున్నారు.రోబోటిక్ రిసెప్షనిస్ట్ గా, హెల్త్ కేర్ రంగంలో, కన్సల్టింగ్ సర్వీసుల్లో ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ను అభివృద్ది చేస్తు న్నారు.