ప్రజాసంక్షేమమే లక్ష్యం : తోట లక్ష్మీకాంతరావు

  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

పిట్లం, వెలుగు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్​ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు అన్నారు. మంగళవారం జుక్కల్​ ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సీఎంఆర్ఎఫ్​ ఉపయోగకరంగా ఉందని అన్నారు.

 ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం బిచ్కుందలో అప్​గ్రేడ్​ చేస్తున్న ఐటీఐ కాలేజీని సందర్శించారు.  కాలేజీ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.