మహిళలే కుటుంబాలకు వెన్నుముక

బోధన్, వెలుగు: మహిళలు కుటుంబాలకు వెన్నుముక లాంటివారని న్యాయమూర్తులు కొనియాడారు.  గురువారం బోధన్​ పట్టణంలోని కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదులకు,  ఉద్యోగులకు సన్మానం చేశారు.  కార్యక్రమంలో ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి రవికుమార్,  సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్,  ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి పూజిత, అదనపు జూనియర్‌‌‌‌‌‌‌‌ జడ్జి శివ సాయి, బార్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ అధ్యక్షుడు నందకుమార్‌‌‌‌‌‌‌‌,  అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్యామ్ రావు,  డాక్టర్ సమ్మయ్య గవర్నమెంట్ ప్లీడర్ మోహన్ కుమార్,  సంయుక్త కార్యదర్శి వాజిద్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌,మహిళా న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

రోటరీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ఆర్మూర్, వెలుగు: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. మున్సిఫ్ కో కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నసీమా సుల్తానా, జూనియర్ సివిల్ జడ్జి దీప్తిలను మర్యాద పూర్వకంగా సన్మానించి, పుష్పగుచ్చాన్ని, జ్ఞాపికను అందజేశారు. రోటరీ అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కోటగిరి, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోతంగల్ మండలం పీఆర్టీయూ ఆధ్వర్యంలో  మండలంలోని మహిళా టీచర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళా టీచర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.