ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : సునీత కుంచాల

నిజామాబాద్ క్రైం, వెలుగు: ప్రజలు ట్రాఫిక్  రూల్స్  పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లాలోని మేఘన డెంటల్  కాలేజీ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీపీ కల్మేశ్వర్  సింగెనవార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్టీసీ బస్టాండ్, తిలక్ గార్డెన్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్​ చౌరస్తా, పోలీస్ ప రేడ్  గ్రౌండ్  వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి భవిష్యత్ కోల్పోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్  రూల్స్​ పాటించాలని, వాహనాదారులు లైసెన్స్  కలిగి ఉండాలన్నారు. బైక్​ నడిపేటప్పుడు హెల్మెట్​ ధరించాలని, ట్రాఫిక్  రూల్స్​ పాటించాలన్నారు. అనంతరం పోలీస్  సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. డిప్యూటీ కమిషనర్  ఎస్. జయరాం, ప్రొబేషనరీ ఐపీఎస్​ చైతన్య రెడ్డి, ఏసీపీలు టి. నారాయణ, కిరణ్ కుమార్, అరుణ్ కుమార్, ట్రాఫిక్  సీఐ వెంకట్ నారాయణ పాల్గొన్నారు.