హష్ మనీ కేసులో ట్రంప్​కు ఎదురుదెబ్బ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన హష్ మనీ కేసును కొట్టివేయాలని ట్రంప్ చేసిన అభ్యర్థనను న్యూయార్క్ కోర్టు జడ్జి  జువాన్ మెర్చాన్ తిరస్కరించారు. అధికారిక విధులకు సంబంధించిన కేసుల నుంచి మాత్రమే అధ్యక్షులకు రక్షణ వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత ప్రవర్తనతో నమోదైన కేసుల్లో అధ్యక్షులకు మినహాయింపు ఉండదని స్పష్టంచేశారు. 

పోర్న్‌‌స్టార్‌‌‌‌ స్టార్మీ డానియల్స్‌‌కు డబ్బులు చెల్లించడం ట్రంప్ అధికారిక విధుల్లో భాగం కాదని.. అందువల్ల హష్ మనీ కేసులో ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ ఉండదని వివరించారు. తాజా తీర్పుతో ఓ క్రిమినల్ కేసులో శిక్ష ఖరారై దోషిగా వైట్‌‌హౌస్‌‌లో అడుగుపెట్టబోతోన్న మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు.