బైడెన్ నిర్ణయాలతో మూడో ప్రపంచ యుద్ధమే: జూనియర్ ట్రంప్

వాషింగ్టన్​: బైడెన్ నిర్ణయాలు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని జూనియర్ ట్రంప్ మండిపడ్డారు. తన తండ్రి పరిపాలనకు ఆటంకాలు సృష్టించేందుకు బైడెన్ కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. రష్యాపై ఉక్రెయిన్​ను ఉసి గొల్పడం సరికాదన్నారు. అమెరికన్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్​ను ఉపయోగించుకునేందుకు ఉక్రెయిన్​కు ఇప్పుడే అనుమతివ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

బైడెన్ అనాలోచిత నిర్ణయాలతో అమెరికా, రష్యా మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. ‘‘మా నాన్న యుద్ధాలకు దూరం. ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన, అమాయకుల ప్రాణాలు కాపాడేందుకు ఆయన కృషి చేస్తుంటే.. బైడెన్ రెచ్చగొడ్తున్నరు. రష్యాపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తం అవుతాయి. 

ట్రంప్ బాధ్యతలు చేపట్టే వరకు ఎలాంటి ఉద్రిక్తతలకు  ఆస్కారం ఇవ్వొద్దని జెలెన్​స్కీని కోరుతున్నా’’ అని జూనియర్ ట్రంప్ చెప్పారు.