నేను ఓ ‘స్టుపిడ్’ని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్

వాషింగ్టన్: కరోనా విపత్తు సమయంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన చెక్కులపై తన పేరు రాసుకోలేకపోయానని, తాను ఒక ‘స్టుపిడ్’ను అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్ చేశారు. 2020లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు పంపిణీ చేసిన రిలీఫ్ చెక్కులపై తన పేరు రాసుకుని, ప్రజల మెప్పు పొందారని.. ఆ తర్వాత 2021లో తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి చెక్కులు పంచినా.. వాటిపై పేరు రాసుకోకుండా తప్పు చేశానన్నారు.

వాషింగ్టన్​లో బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్​కరోనా విపత్తు సమయంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన చెక్కులపై తన పేరు రాసుకోలేకపోయానని, తాను ఒక ‘స్టుపిడ్’ను అంటూలో జరిగిన కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రెస్క్యూ ప్లాన్​పై సంతకం చేశానని, కానీ దానిపై ప్రచారం చేసుకోలేకపోయానని అన్నారు. ఈ విషయంలో ట్రంప్ నుంచి ఒక పాఠం నేర్చుకున్నానని తెలిపారు. అయితే, తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఆర్థిక విధానాలు దేశానికి ప్రమాదకరమని బైడెన్ చెప్పారు.

కెనడా, మెక్సికోపై సుంకాలు పెంచడం తప్పు.. 
ఫెడరల్ గవర్నమెంట్​లో సమూల మార్పులు తెచ్చి, ఆర్థిక విధానాలను మార్చేయాలని ట్రంప్ అనుచరులు తెరపైకి తెచ్చిన ‘ప్రాజెక్ట్ 2025’ అమెరికాకు పెను విపత్తుగా మారుతుందని బైడెన్ హెచ్చరించారు.  ప్రాజెక్ట్ 2025ని ట్రంప్ విసిరి అవతల పారేయాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అలాగే అమెరికాకు కెనడా, మెక్సికో అత్యంత కీలకమైన మిత్ర దేశాలు అని, ఆ దేశాలపై సుంకాలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ఆ రెండు దేశాల నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచడం అతిపెద్ద మిస్టేక్ అవుతుందని ఆయన హెచ్చరించారు.