డయాలసిస్​ సెంటర్​ ఏర్పాటు చేయాలి : కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​ ​

  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​ ​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​(జీజీహెచ్​)లో ఇరుకు గదిలో ఉన్న డయాలసిస్​ సెంటర్​ను క్యాజువాలిటీలోకి మార్చాలని కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ వైద్యాధికారులను ఆదేశించారు. హాస్పిటల్​లో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆయన శనివారం  పరిశీలించారు. డ్రైనేజీ పనులను స్పీడ్​గా పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుత డయాలసిస్​ సెంటర్​లో ఐదు యూనిట్లు ఉన్నాయని, మరో ఐదు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. హాస్పిటల్​కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో ఆర్ఎంవో డాక్టర్​ రమేశ్ పాల్గొన్నారు.  

ఆదివాసీ సంస్కృతిని విస్తరిద్దాం

భద్రాచలం : మారుమూల ప్రాంత ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రపంచ దేశాలకు విస్తరిద్దామని కలెక్టర్​ జితేశ్ పిలుపునిచ్చారు. ఐటీడీఏలోని వైటీసీలో డీఆర్డీఏ, ఎంఎస్​ఎంఈ సెల్ఫ్​ హెల్ప్ గ్రూపు మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, ఔషధగుణానికి సంబంధించిన పదార్థాల స్టాళ్లను ఆయన పరిశీలించారు.  గిరిజన మహిళలే కాకుండా వివిధ గ్రూపు మహిళల సహకారం తప్పకుండా ఈ యజ్ఞానికి అవసరం ఉంటుందన్నారు. 

ముక్కోటి ఏకాదశికి దేశ, విదేశాల నుంచి భక్తులు, టూరిస్టులు వస్తారని, వారికి రివర్​ ఫెస్టివల్​ ఏరు ద్వారా ఆదివాసీ ప్రపంచాన్ని పరిచయంచేద్దామని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్​ నుంచి వచ్చిన ప్యాకింగ్ ​డిజైనర్స్ మహిళలకు కరక్కాయల పొడితో టీ తయారు చేయడం, జొన్న రవ్వ, రాగి రవ్వ, మరమరాలతో బొంగు పేలాలు తయారు చేసి ప్యాకింగ్, డిజైనింగ్​వాటి మీద గ్రూపు పేర్లు ఏ విధంగా పెట్టాలో నేర్పించారు. కలెక్టర్​ వెంట డీఆర్డీవో విద్యాచందన, డీఎం జీసీసీ సమ్మయ్య ఉన్నారు.