తెలంగాణ కొత్త గవర్నర్​గా జిష్ణుదేవ్ వర్మ

  • నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • 9 రాష్ట్రాలకు నియామకాలు

న్యూఢిల్లీ: తెలంగాణ కొత్త గవర్నర్​గా జిష్ణుదేవ్  వర్మ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఆయనను నియమించారు. అలాగే 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాజస్థాన్ గవర్నర్​గా హరిబాబు కిషన్  రావు బాగ్డే, సిక్కిం గవర్నర్​గా ఓంప్రకాశ్  మాథుర్, జార్ఖండ్  గవర్నర్ గా సంతోష్  కుమార్  గాంగ్వార్, ఛత్తీస్ గఢ్  గవర్నర్​గా రమణ్​ దేకా, మేఘాలయ గవర్నర్​గా సీహెచ్  విజయ శంకర్  నియమితులయ్యారు.

ప్రస్తుతం జార్ఖండ్​తో పాటు తెలంగాణకూ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. అసోం గవర్నర్  గులాం చంద్  కటారియాను పంజాబ్  గవర్నర్ గా నియమించడంతో పాటు చండీగఢ్  గవర్నర్ గా అదనపు బాధ్యతలుఅప్పగించారు. సిక్కిం గవర్నర్  లక్ష్మణ్​ ప్రసాద్  ఆచార్యను అసోం గవర్నర్ గా నియమించారు. దాంతోపాటు మణిపూర్  గవర్నర్ గానూ ఆచార్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.