Jio Annual Plan: జియో కొత్త రీచార్జ్ ప్లాన్..912GB డేటా, OTT సబ్ స్క్రిప్షన్ ఫ్రీ

రిలయన్స్ జియో రీచార్జ్ ప్లాన్లధరలు పెంచినప్పటికీ..కస్టమర్ల డబ్బు సద్వినియోగం అయ్యే ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునే రీచార్జ్ ప్లాన్లను తీసుకొ స్తుంది. అలాంటిదే తాజాగా రూ.3999 వార్షిక ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ తో ఏడాది పొడవునా నిరాంతరాయంగా సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం... 

జియో రూ. 3999 రీచార్జ్ ప్లాన్ కంపెనీ వార్షిక ప్లాన్ ఆఫర్లలో ఒక భాగం..ఇది దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఒకసారి 3999 రూపాయలంలో రీచార్జ్ చేసుకుంటే 365 రోజులు నిరంతరం అంతరాయం లేని సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజు 100 ఉచిత SMSలు  చొప్పున  సంవత్సరం పొడవునా 6500 SMS లు పొందవచ్చు. 

ఈ ప్లాన్తో రోజుకు2.5GB తో అన్ లిమిటెడ్ 5G డేటా ను పొందుతారు. అంటే 365 రోజుల పాటు 912.5 GBల హైస్పీడ్ డేటాను అందిస్తుంది.అంతేకాకుండా ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వినియోగదారులు ఉచిత ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్, OTT స్ట్రీమింగ్ కోసం Jio సినిమాకి యాక్సెస్, Jio TV , Jio క్లౌడ్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్లను పొందుతారు. 

 అదనపు పెర్క్‌లు అపరిమిత కాల్‌ల నుంచి వినోదం వరకు అన్నింటినీ ఒకే రీఛార్జ్‌లో అందించడం ద్వారా ఈ ప్లాన్‌ను పూర్తి వినోదం, టెలికాం ప్యాకేజీగా మారుస్తాయి.