మార్కెట్‌లోకి రెండు జియో భారత్ ఫోన్లు : ఫీచర్లు ఇవే..

ఇండియన్ మొబైల్ మార్కెట్ లోకి రిలయన్స్ జియో రెండు కొత్త జియో భారత్ ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. భారతీయ మొబైల్ కాంగ్రెస్ 2024లో జియో భారత్ ఫీచర్ ఫోన్‌లను స్పెసిఫికేషన్లు రిలీజ్ చేసింది రిలయన్స్ కంపెనీ. 4జీ కనెక్టివిటీలో- జియో భారత్ V3, V4 రెండు వేరియంట్లను రూ.1,099 ధరతో అమ్మనున్నారు. ఈ ఫోన్లలో జియో టీవీ, జియో సినిమాలు వంటి జియో సేవల ఉన్నాయి. జియో భారత్ ఫోన్ రీఛార్జ్ ఫ్లాన్ రూ.123లకు నెలవారీ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 జీబీ డేటా వరకు పొందవచ్చు.

జియోభారత్ మోడల్‌లు త్వరలో జియో స్టోర్స్‌తో పాటు ఇ -కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు జియోమార్ట్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు యాప్‌లు, ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన సర్వీసులు కలిగి ఉంటాయి. ఇందులో జియో టీవీ, జియో సినియాలు, UPI చెల్లింపుల కోసం జియో పే వంటి యాప్స్ తీసుకొచ్చింది రిలయన్స్.

V3 స్టైల్-సెంట్రిక్ డిజైన్ ఉంటే.. V4 మినిమలిస్టిక్ డిజైన్‌తో ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే V3, V4 ఫీచర్ ఫోన్‌లు 1000mAh బ్యాటరీ కలిగి ఉన్నాయి.128GB వరకు స్టోరేజ్‌ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆపరేటింగ్ కోసం 23 ఇండియన్ ల్యాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి ఈ ఫీచర్ ఫోన్లో.. 

ALSO READ | 5జీనే కాదు 6జీతో మరిన్ని రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు : జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ