జియో 5G కొత్త రీఛార్జ్ ప్లాన్ : 90 రోజులకు 200 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. అతి తక్కువ ధరకే..

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్లపై ఛార్జీలు పెంచగా.. వినియోగదారులు లబోదిబో మంటున్నారు. చాలామంది తమ నెట్ వర్క్ నుంచి వేరే కనెక్షన్ కు జంప్ అవుతున్నారు. రిలయన్స్ కంపెనీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడిప్పుడే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. సరసమైన ధరలకు అందిస్తోంది. తాజాగా 5జీ రీఛార్జ్ ప్లాన్ ఒకటి రిలయన్స్ జియో ప్రకటించింది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్ లేదా బ్రౌజింగ్ కోసం ఎక్కువ డేటా వాడే 5జీ యూజర్లకు బాగా పని చేస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే దాదాపు 100 రోజులకు వరకు మీకు మరో రీఛార్జ్ అవసరం లేదు.. 

ALSO READ | ఇండియాలో 5G సొల్యూషన్‌ కోసం : చేతులు కలపనున్న ఎయిర్‌టెల్, నోకియా!

90 రోజులు అపరిమిత కాల్స్, 100 ఉచిత SMS, 180 జీపీ డేటా అన్ లిమిటెడ్ ఈ టారిఫ్ ప్లాన్ తో మీరు పొందుతారు. ఇంకా ఎక్ట్ర్సా  బోనస్ గా 20 జీబీ డేటా మీకు లభిస్తోంది.  మొత్తం ఈ ప్లాన్ తో 90 రోజులకు గాను 200 జీబీ డేటా మీకు వస్తుంది. రీఛార్ ప్లాన్ ధర కేవలం రూ.899 లే. 5G ప్లాన్ సెగ్మెంట్‌లో ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఎక్ట్ర్సా యాడ్ ఆన్ గా జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్‌తో సహా జియో సర్వీస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్‌ వస్తోంది.