జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఫరక్కా లాల్మాటియా మధ్యలో రైల్వేట్రాక్‌ను పేల్చేశారు గుర్తుతెలియన దుండగులు. ట్రాక్ పై పేలుడు పదార్థాలు ఉంచి పేల్చడంతో ట్రాక్ పై మూడు అడుగుల గుంత ఏర్పడింది. ట్రాక్ పట్టాలు తెగిపోయాయి. బుధవారం(అక్టోబర్2) జరిగిన ఈ ఘటన వెనక క్రిమినల్గ్యాంగ్హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
లాల్మాటియా నుంచి ఫరక్కా వెళ్లే ఎంజీఆర్ రైల్వే లైన్లో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత ఈ మార్గంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు చెప్పారు.
Also Read :- వరద సహాయ చర్యలకు వెళ్లి నదిలో ల్యాండ్ అయిన ఆర్మీ హెలికాప్టర్
అయితే ఇది ఇండియన్ రైల్వే నెట్ వర్క్ లో భాగంగా కాదు. ఇది గొడ్డాస్ లాల్మాటియా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కాలోని పవర్ స్టేషన్ వరకు బొగ్గు రవాణా కోసం NTPC ఏర్పాటు చేసిన ట్రాక్ ఇది. పేలుడు ధాటికి 470 సెంటీమీటర్లు ట్రాక్ విరిగి పోయిందని పోలీసులు గుర్తించారు. కొందరు దుండగులు పేలుడు పదార్థాలు అమర్చి రైల్వే ట్రాక్ ను పేల్చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.