పోలీసుల అదుపులో బైక్​ దొంగలు

లింగంపేట, వెలుగు : హైదరాబాద్​లో బైకులను దొంగిలించి లింగంపేటలో విక్రయించిన వ్యక్తితో పాటు వాటిని కొనుగోలు చేసిన బైక్​ మెకానిక్​ను శుక్రవారం జీడిమెట్ల క్రైమ్​బ్రాంచ్​ పోలీసులు లింగంపేటలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలం ఐలాపూర్​ గ్రామానికి చెందిన మన్నెరాజు కొంతకాలంగా హైదరాబాద్​లో ఉంటున్నాడు.  

అక్కడ బైకులు దొంగిలిస్తూ లింగంపేటలో బైక్​ మెకానిక్ గా పనిచేస్తున్న శివ కుమార్​గౌడ్​కు విక్రయించేవాడు. ఇతడు తన వద్దకు వచ్చే కస్టమర్లకు వాటిని అమ్మేవాడు. ​బైక్​ చోరీ విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్న జీడిమెట్ల పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఐలాపూర్​కు చెందిన

మన్నె రాజు వెహికల్స్​ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఐలాపూర్​లో రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిచ్చిన సమాచారం మేరకు​ శివకుమార్ ​గౌడ్​ను కూడా అరెస్ట్​ చేశారు. వీరి నుంచి బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.