పెర్త్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ నిప్పులు చెరిగాడు. 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్ గా 18 ఓవర్లు బౌలింగ్ చేసి 1.67 ఎకానమీ రేటుతో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, కెప్టెన్ పాట్ కమిన్స్ వికెట్లను తీసుకున్న బుమ్రా.. కెరీర్ లో 11 వ సారి 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. విదేశాల్లో బుమ్రాకు ఇది 7 వ 5 వికెట్ల సాధించడం విశేషం. దీంతో భారత మాజీ దిగ్గజ క్రికెట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సరసన బుమ్రా చేరాడు.
సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఏడవ సారి ఐదు వికెట్ల హాల్‌ను సాధించిన ఈ పేసర్..అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్ గా కపిల్ దేవ్ సరసన చేరాడు. కపిల్ దేవ్ కూడా 7 సార్లు ఈ ఘనత సాధించాడు. సెనా దేశాల్లో బుమ్రా జోహన్నెస్‌బర్గ్, మెల్‌బోర్న్, నాటింగ్‌హామ్, నార్త్‌సౌండ్, కింగ్‌స్టన్, కేప్‌టౌన్, పెర్త్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. BS చంద్రశేఖర్, జహీర్ ఖాన్ ఆరు సార్లు.. బిషన్ సింగ్ బేడీ, అనిల్ కుంబ్లే ఐదు సార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నారు. ఇప్పటివరకు సేనా దేశాల్లో 27 టెస్టుల్లో బుమ్రా 22.55 సగటుతో 118 వికెట్లు పడగొట్టాడు.
Also Read : ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ ఆధిక్యం ఎంతంటే..?
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో తీవ్రంగా నిరాశపరిచింది. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి తలవంచుతూ కేవలం 150 పరుగులకే ఆలౌటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఆతిధ్య ఆసీస్ జట్టు కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. 7 వికెట్లకు 67 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు 37 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది.