ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల దూకుడు: అగ్ర స్థానంలో బుమ్రా.. టాప్ 10లో కోహ్లీ

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన మన ఆటగాళ్లు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లారు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో తిరిగి మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో ఉన్న స్పిన్నర్ అశ్విన్ ను వెనక్కి నెట్టి బుమ్రా అగ్ర స్థానంలో నిలిచాడు.  ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 870 రేటింగ్ పాయింట్స్ తో టాప్ లో ఉండగా.. అశ్విన్ కు 869 రేటింగ్ పాయింట్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ మూడో స్థానంలో రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నారు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ 6 లో ముగ్గురు భారత ఆటగాళ్లే ఉండడం విశేషం. బ్యాటింగ్ విషయానికి వస్తే యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో అర్ధ సెంచరీలు చేసి తన ర్యాంక్ ను మెరుగుపర్చుకున్నాడు. ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ తర్వాత టాప్ 10 లో చోటు కోల్పోయిన కోహ్లీ ఆరు స్థానాలు ఎగబాకి 6 వ ర్యాంక్ కు చేరుకున్నాడు. 

ALSO READ | IPL 2025: వేలంలోకి కేఎల్ రాహుల్‌.. రూ.20 కోట్లైనా తగ్గేది లేదంటున్న RCB!

రిషబ్ పంత్ మూడు స్థానాలు కోల్పోయి 9 వ స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 15.. శుభమాన్ గిల్ 16 వ ర్యాంక్ లో నిలిచారు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన అగ్ర స్థానాన్ని నిలుపుకున్నాడు. విలియంసన్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమ్స్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.