JanhviKapoor:హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) గురువారం ఉదయం (నవంబర్ 7న) మధురానగర్ లోని హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలో ఒక సినిమా షూటింగ్లో పాల్గొనడానికి వచ్చిన జాన్వీ హనుమాన్ టెంపుల్లో పూజలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. దాదాపు అరగంటకు పైగా హనుమాన్ టెంపుల్ లోనే జాన్వీ ఉండటంతో.. స్థానికులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.  

జాన్వీ కపూర్‌కు దైవ భక్తి అధికమే అని చెప్పుకొవాలి. ఎందుకంటే ఖాళీ దొరికితే తరచూ ఆలయలకు వెళ్తుంటుంది. తిరుమల శ్రీవారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటుంది. అదీ కూడా మెట్ల మార్గంలో నడుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడంతో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఈ ఫోటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

జాన్వీ.. దేవర సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. రాబోయే దేవర 2 లో ఆమె పాత్ర మరింత ప్రత్యేకం కానుందని టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న రామ్ చరణ్ RC16 లో నటిస్తోంది.ఇటీవలే జాన్వీ గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, ధడక్, ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజి మీడియం, రూహి, మిలి, వంటి పలు సినిమాల్లో  హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది.