మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

వివాదాలు ఆయనకు కేరాఫ్ అడ్రస్‌. ఆయన ఎవరో కాదు జనగామ బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. తాజాగా మరో వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. దళితబందు ఇప్పిస్తానని 67 మంది దళితుల నుంచి ముత్తిరెడ్డి లక్ష రూపాయలు తీసుకున్నాడని ఆరోపిస్తూ నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫాంహౌస్ ను  బాధితులు ముట్టడించారు. 

జనగామ  మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి .. దళితబంధు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన67మంది బాధితులు  ఆరోపించారు. దళితబంధు రానందున తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు  నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫాం హౌస్ ను బాధితులు ముట్టడించారు. ఒకరిద్దరికే  దళితబంధు మంజూరైందని, ఆ డబ్బులు రావాలంటే లక్ష రూపాయిలు   తమకు ఇవ్వాలని అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి   డిమాండ్‌ చేశారని బాధితులు  తెలిపారు. దీంతో తాము నర్మెట్ట మండలంలోని మాజీ  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫాంహౌస్ ను  ముట్టడించారు.  బాధితులను పోలీసులు అడ్డుకున్నారు.లిఖిత పూర్వకరంగా ఫిర్యాదుచేస్తే న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు. 

Also read :- మల్కాజిగిరి ఎంపీ సీటుకు బండ్ల గణేష్ దరఖాస్తు

 అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తనకు దళితబంధు ఇప్పిస్తారా.. అని అడిగితే ప్రభుత్వం మారిందని, మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పుడే తీసుకోవాలని ముత్తిరెడ్డి  బదులిచ్చారని తెలిపారు. ఇక దళితబంధు రాదని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరామని బాధితులు తెలిపారు.