జమ్మికుంట సప్తగిరి మిల్లులో రూ.2 కోట్ల ధాన్యం మాయం

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లుపై సోమవారం సివిల్ సప్లయీస్, ఎన్ ఫోర్స్ మెంట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 2022–-23 యాసంగి, 2023– 24 వానాకాలం, 2023–24 యాసంగి సీజన్లలో మరాడించడానికి సర్కార్ ఇచ్చిన 10,756 క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. పక్కదారి పట్టిన ధాన్యం విలువ రూ.2 కోట్లపైనే ఉంటుందని అంచనా. దాడుల్లో డీఎం హీథీరాం, సీఐ రవి, తహసీల్దార్ విజయ, డీటీసీఎస్ వసంతరావు, ఈఎస్ఐ వినోద్ కుమార్, టాస్క్ ఫోర్స్ మెంబర్ అనిల్ పాల్గొన్నారు.