ప్రతి మిల్లర్​ వడ్లు దించుకోవాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు : ప్రతి ఒక్క రైస్ మిల్లర్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను దిగుమతి చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో రైస్ మిల్లర్లతో మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా రా రైస్‌‌‌‌, బాయిల్డ్ రైస్ మిల్లర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం థరూర్ క్యాంపులో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదాంను అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత తో కలిసి తనిఖీ చేశారు.

వడ్ల కొనుగోలు పోస్టర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రైస్ మిల్లుల వద్ద వెంటనే వడ్లు దించుకోవాలని అలా కుదరకపోతే తాత్కాలికంగా గోదాంలకు తరలించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్‌‌‌‌లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. అనంతరం అడిషనల్‌‌‌‌ కలెక్టర్ ఖీమ్యా నాయక్‌‌‌‌తో కలిసి వడ్ల కొనుగోళ్ల పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. డీఆర్డీవో శేషాద్రి, డీసీఎస్‌‌‌‌వో వసంతలక్ష్మి, సివిల్ సప్లై డీఎం రజిత, డీసీవో రామకృష్ణ  పాల్గొన్నారు.