సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జగిత్యాల మున్సిపల్‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌

జగిత్యాల, వెలుగు: ఇందిరా మహిళా శక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి ఆకాంక్షించారు. బుధవారం వేములవాడలో పర్యటించిన సీఎం రేవంత్‌‌రెడ్డిని ఆమె కలిసి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాల మేరకు మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్‌‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. 

మహిళలను స్వయం సాధికారత కలిగిన శక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యం తో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.