జగిత్యాల జేఎన్టీయూ స్టూడెంట్ మిస్సింగ్

  • పోలీసులకు కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు 

కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూ కాలేజ్ మెకానికల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ హితేశ్(19) మిస్సింగ్ అయ్యాడు. ఈ మేరకు గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 19న సాయంత్రం ఐదు గంటల నుంచి విద్యార్థి కనిపించడం లేదు. హాస్టల్ గదికి రాకపోవడంతో కేర్ టేకర్ యుగేందర్ తెలిపిన మేరకు ప్రిన్సిపల్ స్టూడెంట్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

ఇంటికి కూడా వెళ్లకపోవడంతో బంధువుల ఇండ్లలో వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హాస్టల్ ఫీజు కట్టడానికి పేరెంట్స్  పంపిన డబ్బుతో విద్యార్థి బెట్టింగ్ లకు పాల్పడి పోగొట్టుకున్నాడని, దీంతో మిస్సింగ్ అయినట్లు తోటి స్టూడెంట్లు తెలిపారు. అదృశ్యమైన స్టూడెంట్ ఏపీ రాష్ట్రానికి చెందినట్లుగా చెప్పారు. పోలీసుల విచారణలో హితేశ్​ఫోన్ ట్రేస్ చేయగా వరంగల్ వద్ద స్విచ్ఛాఫ్ అయినట్లు తెలిసింది.