హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల ల్యాండ్ కబ్జా ఇష్యూ

 జగిత్యాల మున్సిపాలిటీలో ల్యాండ్ కబ్జా ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కబ్జాదారులతో మున్సిపల్ కమిషనర్ అనిల్, ఆర్వో ప్రసాద్ కుమ్మక్కుకావడం సంచలనంగా మారింది. దీంతో మున్సిపల్ ఆర్వో ప్రసాద్ తో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మున్సిపల్ కమిషనర్ అనిల్, మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

జగిత్యాల మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 1599లోని 12 గుంటల భూమి కబ్జా అయినట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన ఖాజా అమిరుద్దీన్, ఇమ్రాన్, ముజాకీర్ ల్యాండ్ కబ్జా చేసినట్లు తేలింది. అయితే వీరికి మున్సిపల్ ఆర్వో ప్రసాద్, కమిషనర్ అనిల్ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫేక్ రికార్డ్స్ తో ల్యాండ్ అమ్మేందుకు స్కేచ్ వేసినట్లు తెలుస్తోంది.

 ల్యాండ్ లో సరిహద్దు రాళ్లు పాతుతుండగా భూ యాజమాని కీర్తి విజయలక్ష్మి అడ్డుకున్నారు. ల్యాండ్ తమదేనని యాజమానిని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి ఫిర్యాదుతో ల్యాండ్ కబ్జా వ్యవహారం అంతా బయటపడిందని పోలీసులు తెలిపారు.