సింగరేణిలో ఎల్లో, రెడ్ కార్డుల .. విధానాన్ని రద్దు చేయండి : ఏఐటీయూసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఎల్లో, రెడ్​ కార్డులతో హెచ్చరికలు చేసేలా మేనేజ్​మెంట్​ తీసుకువచ్చిన విధానాన్ని రద్దు చేయాలని మంగళవారం అన్ని గనులు, ఓసీపీల్లో ఏఐటీయూసీ లీడర్లు ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఏఐటీయూసీ లీడర్లు మాట్లాడుతూ సింగరేణిలో మైనింగ్ సూపర్ వైజర్స్ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ముందుభాగాన ఉంటున్నారన్నారు.

అలాంటి వారిని గని ప్రమాదాలకు కారకులుగా పేర్కొంటూ ఎల్లో కార్డు, రెడ్ కార్డు హెచ్చరిక విధానాన్ని జారీ చేసి వారిని మానసికంగా దెబ్బతీయడం సరికాదన్నారు. కార్డుల హెచ్చరిక విధానాన్ని రద్దు చేయకపోతే బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి మైనింగ్​ సిబ్బందికి అండగా ఉంటామని ప్రకటించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ లీడర్లు మహేందర్, ఎస్.వెంకట్ రెడ్డి, మిట్ట శంకర్​, శ్రీనివాస్, రామస్వామి, పి.నాగేంద్ర కుమార్, ప్రభుదాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.