AI News : చాట్ జీపీటీకి 15 వేల మిలియన్ యూరోల జరిమానా వేసిన ఇటలీ ప్రభుత్వం

డేటా ప్రొటెక్ట్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటి(Ganrante) ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ OpenAI కి సుమారు140 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కస్టమర్ల సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో చట్టపరమైన ఉల్లంఘటన జరిగాయని ఆరోపిస్తూ  Open AI CharGPT ద్వారా పర్సనల్ డేటా నిర్వహణను దర్యాప్తు పరిశీలించింది. 

ఇటాలియన్ వాచ్ డాగ్ ప్రకారం.. డిసెంబర్ 20న ఓపెన్ AI చాట్ జీపీటీపై జరిమానా విధించింది. ఐరోపా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఇది తొలి పెనాల్టీ.  గారంటే ప్రకారం.. OpenAI చట్టపరమైన ఎలాంటి అనుమతులు లేకుండా ChatGPT శిక్షణ ఇచ్చేందుకు కస్టమర్ల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసింది. ట్రాన్స్ పరెన్సీ, ప్రిన్సిపుల్స్ ను ఉల్లంఘించింది. 13 యేళ్ల లోపు పిల్లలను హానికరమైన కంటెంట్ అందకుండా ఎటువంటి చర్యలు తీసుకోలేదని దర్యాప్తులో తేలింది. 

ALSO READ | గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..

పెనాల్టీ తో పాటు ఆరు నెలలపాటు OpenAI ఇటాలియన్ మీడియాలో ప్రజలకు అవగాహన ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. EU ప్రైవసీ నియమాలను ఉల్లంఘించినందుకు ఇటలీ వాచ్ డాగ్.. ChatGPT  ని తాత్కాలికంగా 2023లో తాత్కాలికంగా నిషేధించింది.

 ఆ తర్వాత విచారణ చేపట్టింది. అల్గారిథం శిక్షణకోసం ఉపయోగించే వారి డేటా సేకరణలో కస్టమర్ల అనుమతి,OpenAI లో మార్పులు అమలు చేసిన తర్వాత నిషేధం ఎత్తివేసింది. తాజా నిర్ణయంతో OpenAI ChatGPT  కంపెనీ గ్లోబల్ టర్నోవర్ లో 4శాతం జరిమానా విధించింది.