రూ. 20 వేల కోట్ల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌.. ఒక్క రిజర్వాయరూ లేదు !

  • ‘సీతారామ’ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్‌ సర్కార్‌ లోపం
  • శంకుస్థాపన చేసిన ఆర్నెళ్లలోనే నాలుగు రిజర్వాయర్లు క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌
  • ప్రత్యామ్నాయాలను పట్టించుకోని నాటి ప్రభుత్వం
  • నీళ్లున్నా ఎత్తిపోసుకోలేని పరిస్థితి

ఖమ్మం, వెలుగు : గత ప్రభుత్వం ఆర్భాటంగా మొదలు పెట్టిన సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజీవ్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌, ఇందిరా సాగర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రిడిజైన్‌‌‌‌‌‌‌‌ పేరుతో సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా మార్చింది. రూ. 20 వేల కోట్ల ఖర్చుతో నిర్మించాలని నిర్ణయించిన ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో ఒక్కటంటే ఒక్క రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ కూడా లేకపోవడంతో నీళ్లు ఉన్నా వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.

మొదట ప్రకటించి.. తర్వాత విస్మరించిన్రు

రాజీవ్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌, ఇందిరాసాగర్‌‌‌‌‌‌‌‌ రీడిజైన్‌‌‌‌‌‌‌‌ చేసిన టైంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం వద్ద రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తామని, అప్పటికే ఉన్న రోళ్లపాడు, బయ్యారం చెరువు, పాలవాగులను సైతం రిజర్వాయర్లుగా మారుస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రకటించింది. సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు 2016 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రోళ్లపాడు దగ్గర శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత చేసిన మార్పులు, చేర్పుల్లో రిజర్వాయర్లన్నీ కనుమరుగయ్యాయి. 

కిన్నెరసాని అభయారణ్యం, కేటీపీఎస్‌‌‌‌‌‌‌‌, రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌తో పాటు సాగు భూమి తక్కువగా ఉందన్న కారణాలను చూపుతూ రిజర్వాయర్ల నిర్మాణాన్ని పక్కనపెట్టేశారు. తర్వాత ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌ను కొంత మార్చి ములకలపల్లి మండలంలో రెండు పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో మొత్తం రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో ఒక్క రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ కూడా లేకుండా పోయింది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేసిన ఆర్నెళ్లలోనే రిజర్వాయర్ల విషయంపై క్లారిటీ వచ్చినప్పటికీ ప్రత్యామ్నాయాలను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోలేదు. రిజర్వాయర్ల నిర్మాణంపై ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ చేసినా అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ లైట్‌‌‌‌‌‌‌‌ 
తీసుకున్నారు.

కురవి వీరభద్రుడి పేరుతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేశారు. పలుమార్లు రివ్యూలు నిర్వహించి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో రూ.7,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ టెయిల్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌ను తప్ప హెడ్‌‌‌‌‌‌‌‌వర్క్స్‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోలేదని గుర్తించారు. మధ్యలో వచ్చే స్ట్రక్చర్లను నిర్మించకపోవడంతో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 

దీంతో ఇప్పటివరకు జరిగిన పనులను ఉపయోగించుకోవడంతో పాటు, కొత్తగా చేపట్టాల్సిన పనులపై ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డితో చర్చించారు. పూర్తి అయిన మూడు పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లను ఉపయోగంలోకి తీసుకువచ్చి, ఏన్కూరు లింక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ ద్వారా వైరా రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు గోదావరి నీళ్లు తీసుకొచ్చేందుకు మంత్రి తుమ్మల ప్రపోజల్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. 

ఆ పనులను మూడు నెలల్లోనే పూర్తి చేసి ఈ నెల 15న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ టైంలోనే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాన్ని సీఎం వెల్లడించారు. కురవి వీరభద్రుడి పేరున డోర్నకల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంతో పాటు, మున్నేరు నుంచి గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌ ద్వారా 32 టీఎంసీల నీటిని తరలించడంపైనా స్టడీ చేస్తామని సీఎం ప్రకటించారు.

కోదాడకు గోదావరి నీరు

పాలేరు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ సముద్ర మట్టానికి 133.9 మీటర్లు ఉండగా, కోదాడ నియోజకవర్గంలోని మునగాలలో ఉన్న నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ 133.4 మీటర్ల లెవల్‌‌‌‌‌‌‌‌లో ఉంది. దీంతో ఫుల్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ లెవల్ నుంచి రివర్స్‌‌‌‌‌‌‌‌లో హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ వరకు నీటిని నిల్వ ఉంచడం వల్ల తూములను ఉపయోగించుకుంటూ కోదాడ నియోజకవర్గంలోని చెరువులను నింపుకునే అవకాశం ఉంది. దీని ద్వారా కోదాడ నియోజకవర్గంలో సుమారు 30 వేల ఎకరాలకు నీటిని అందించ వచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. 

రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ స్వరూపమిలా..

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా డోర్నకల్, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మీదుగా మున్నేరు, ఆకేరు వాగులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు వాగులకు మధ్యలో తిరుమలాయపాలెం మండలం పిండిపోలు, డోర్నకల్‌‌‌‌‌‌‌‌ మండలం ములకలపల్లి రెవెన్యూ పరిధిలోని పాండవుల గుట్టల్లో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 15 టీఎంసీల కెపాసిటీతో నిర్మించే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు 2,200 ఎకరాలు అవసరం ఉంటుందని అంచనా వేశారు. 

ఇక్కడ సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉండగా మిగిలిన పట్టా భూముల్లో సైతం మట్టి గుట్టలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు పెద్దగా భూ సేకరణ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ రాగానే గుట్టలను కలుపుతూ 14 కిలోమీటర్ల రౌండ్‌‌‌‌‌‌‌‌ బండ్​ నిర్మించి, 15 నెలల్లోనే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే డోర్నకల్, పాలేరు నియోజకవర్గాలతో పాటు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గానికి కూడా సాగునీరందించే అవకాశం ఉంటుంది. సాగర్‌‌‌‌‌‌‌‌ కాల్వలను ఉపయోగించుకుంటూ పాలేరు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నుంచి వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని 2.50 లక్షల ఎకరాల సాగర్‌‌‌‌‌‌‌‌ ఆయకట్టును సైతం స్థిరీకరించవచ్చు. 

గ్రావిటీ ద్వారా మున్నేరు నీటి వినియోగం

మున్నేరు వాగు ద్వారా ప్రతి ఏటా సుమారు 30 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సీతారామ కాల్వలు ఆలస్యం అవుతుండడం, ఎత్తిపోతలకు విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఖర్చు అవుతుండడంతో మున్నేరు నీటిని గ్రావిటీ ద్వారా కొత్త రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు తరలించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గార్ల మండలం మద్దివంచ పరిధిలోని దుబ్బగూడెం వద్ద మున్నేరుపై చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌ ఉంది. 

అక్కడి నుంచి 9.6 కిలోమీటర్ల దూరంలోని గార్ల వద్ద నాలుగు మీటర్ల దిగువన పాలేరు లింక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ ఉంది. దీంతో గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంది. కాల్వలకు రూ.110 కోట్లు, భూ సేకరణకు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.140 కోట్ల అంచనాతో కాల్వ తవ్వి మున్నేరు నీటిని పాలేరు ట్రంక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌కు తరలించేలా ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. ఈ కాల్వ ద్వారా నీటిని కొత్త రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌తో పాటు పాలేరు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు తరలించనున్నారు.