నింగిలోకి దూసుకెళ్లిన PSLV- C59..

PSLV- -C59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏపీలో శ్రీహరి కోట నుంచి పీఎస్ ఎల్వీ -సీ 59 రాకెట్ సక్సె్స్ ఫుల్ గా నింగిలోకి దూకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా ESA ప్రోబా3 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ISRO టెక్నాలజీ నైపుణ్యం, NSIL నేతృత్వంలో ఉమ్మడిగా గ్లోబల్ మిషన్ నిర్వహించడం ద్వారా PSLV- -C59 రాకెట్ ..ప్రోబా 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. PSLV- C59 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిందని.. ఇది భారత్ గర్వించదగ్గ రోజు అని ఇస్రో ట్వీట్ చేసింది. 

ప్రోబా 3 శాటిలైట్ ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది. ఈ మిషన్​లో కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ రెండింటి బరువు సుమారు 550 కిలోలు. వీటిని స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి లాంఛ్ చేశారు.