ఇస్రో మరో ప్రయోగం.. రేపు PSLV-C60 కౌంట్డౌన్

PSLV-C60 ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరో ప్రయోగం చేపట్టనుంది. సోమవారం (డిసెంబర్ 30) పీఎస్ ఎల్వీ సి60 రాకెట్ ను ప్రయోగించనుంది. ఏపీలో శ్రీహరి కోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది. ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. 

రాకెట్ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్కు చెందిన స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది.

SpaDeX మిషన్‌లో SDX01 (ఛేజర్) , SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి.  ఒక్కొక్కటి సుమారు 220 కిలోల బరువు ఉంటుంది. ఈ ఉపగ్రహాలను 470 కి.మీ ఎత్తులో తక్కువ-భూమి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.  అక్కడ అవి రెండెజౌస్ , డాక్ చేయడానికి పనిచేస్తాయి. 

SpaDeX వంటి కార్యక్రమాల ద్వారా అంతరిక్ష టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఇస్రో ప్రయత్నిస్తోంది.ఇది  ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో పెరుగుతున్న భారత్ పాత్రను హైలైట్ చేస్తుంది.