చంద్రయాన్ 4కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం.. 2024 చివరిలోగా ల్యాంచ్ : ఇస్రో ఛైర్మన్

చంద్రయాన్ 4కు సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్  పూర్తి అవ్వడంతో  కేంద్ర కేబినేట్ ఆమోదం పొందామని  ఇస్రో  చీఫ్ సోమనాథ్ అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన స్పేస్ ఎక్స్ పో 2024లో ఆయన పాల్గొన్నారు. చంద్రయాన్-3 మిషన్ లక్ష్యంలో మూన్ పై ఉపగ్రహం సురక్షితంగా ల్యాండ్ చేయడం మాత్రమేనన్నారు. ఇక ఇప్పుడు చంద్రయాన్ 4లో భాగంగా ఉపగ్రహం సేఫ్ ల్యాండ్ అయి తిరిగి భూమికి తీసుకొస్తామని సోమనాథ్ వివరించారు. దీని కోసం శాటిలైట్స్ డబుల్ అవుతాయన్నారు ఆయన. సరిపడా ప్రయోగ సామర్థ్యం లేదని.. అందుకే రెండు లాంచ్ లు చేస్తామన్నారు. 2024 చివరిలోగా గగన్ యాన్ ని లాంచ్  చేస్తామని ఇస్రో చీప్ సోమనాథ్ తెలిపారు.