ఆలస్యం ప్రమాదమే.. సునీత విలియమ్స్ రాకపై ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాప్ట్ తో సమస్యల కారణంగా భూమికి రావాల్సిన టైం దాటిపోయినా అంతరిక్షంలోనే ఉండిపోయారు. సునీతా విలియమ్స్ రాకపై ఇస్రో చీఫ్ డా. ఎస్.సోమ్ నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. సునీతా విలియమ్స్ రాక 2025 వరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని స్పేస్ నిపుణులు చెబుతున్న క్రమంలో.. వ్యోమగాముల ఆరోగ్యంపై ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరో వ్యోమగామి బారీ విల్మోర్ తో పాటు బోయింగ్ స్టార్ లైనర్ సునీత అంతరిక్ష నౌకలోనే ఉండిపోయారు. వాస్తవానికి జూన్ లో ప్రయోగించిన కొద్దిసేపటికే తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. షెడ్యూల్ టైం ముగిసినప్పటికీ సాంకేతిక కారణాలతో భూమిపైకి తిరిగి  రాలేకపోయారు. 

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతారు.. దానర్థం.. మన దగ్గర పరిష్కారం లేదని కాదు.. పరిస్థితి అదుపులో ఉందని.. పరిస్థితులు సవాల్ గా ఉనప్పటికీ సునీతా విలియమ్స్ ను త్వరగా భూమిపైకి తీసుకొచ్చే పరిష్కారాలు అన్వేషిస్తున్నామని సోమ్ నాథ్ అన్నారు. 

కొనసాగుతున్న మిషన్ సమస్యలు 

NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ లో ప్రారంభమయిన తర్వాత వారం రోజుల్లో మిషన్ కంప్లీట్ చేసుకొని భూమికి తిరిగి వస్తారని భావించారు. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకతో సమస్యల కారణంగా అంతరిక్షంలోనే ఉన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తోంది. 

సునీతా విలియమ్స్ తిరిగి రావడానికి నాసా అత్యవసరంగా ఒక తీర్మానాన్ని కోరింది. ప్రాథమిక సమస్య స్టార్‌లైనర్ లోపభూయిష్ట ప్రొపల్షన్ సిస్టమ్‌తో ఉంది. ఇది సిబ్బంది తిరిగి వచ్చే విమానానికి భద్రతా ప్రమాదాలను కలిగిస్తుంది. ఆగస్ట్ చివరి నాటికి వ్యోమగాముల రిటర్న్‌పై నిర్ణయం తీసుకుంటామని నాసా అధికారులు సూచించారు.