ఇస్రో మరో విజయం: ఆర్ఎల్ వీ ల్యాండింగ్ పరీక్ష సక్సెస్.. 

న్యూఢిల్లీ:స్వయంప్రతిపత్తి సామర్థ్యం కలిగి ఉన్న LEX టెక్నాలజీతో పనిచేసే రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ ఎక్స్ పెరిమెంట్ లాస్ టెస్ట్ విజయ వంతంగా పూర్తి అయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) తెలిపింది. ఈ టెక్నాలజీ సిరీస్ లో ఇది మూడోవిజయం. కర్నాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR)  లో ఆదివారం (జూన్ 23) ఉదయం 07.10 గంటలకు పరీక్షించారు. 

ఈ ప్రయోగంలో భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ తో 4.5 కిలోమీటర్ల ఎత్తులో పుష్పక్ అనే రెక్కలున్న వెహికల్ ను విడుదల చేశారు.లేటెస్ట్ సొంతంగా పనిచేసే సాయుధమై పుష్పక్ ఖచ్చితమైన క్షితిజ సమాంతర ల్యాండింగ్‌ అయిందని ఇస్రో తెలిపింది. 

రన్‌వే నుంచి4.5 కి.మీ దూరంలోని విడుదల పాయింట్ నుంచి పుష్పక్ స్వయంగా క్రాస్-రేంజ్ కరెక్షన్ చర్యలతో  రన్‌వే వద్దకు చేరుకుంది.  రన్‌వే సెంటర్‌లైన్‌లో ఖచ్చితమైన క్షితిజ సమాంతర ల్యాండింగ్‌ అయింది. అని స్పేస్ ఏజెన్సీ పేర్కొంది.

ఈ వెహికల్ తక్కువ లిఫ్ట్-టు-డ్రాగ్ రేషియో ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ తో ల్యాండింగ్ వేగం 320 kmph కంటే ఎక్కువగా ఉంది. ఇది కమర్షియల్ విమానానికి 260 kmph , సాధారణ యుద్ధ విమానానికి 280 kmph ఉంటుంది.టచ్‌డౌన్ తర్వాత, బ్రేక్ పారాచూట్‌లను ఉపయోగించి వెహికల్ వేగాన్ని దాదాపు 100 కి.మీలకు తగ్గించినట్లు ఇస్రో పేర్కొంది. అప్పుడు ల్యాండింగ్ గేర్ బ్రేక్‌లు వేగాన్ని తగ్గించడానికి , రన్‌వేపై వెహికల్ ను అదుపు చేసేందుకు వినియోగించారు. 

RLV-LEX మిషన్..ఇనర్షియల్ సెన్సార్, రాడార్ ఆల్టిమీటర్, ఫ్లష్ ఎయిర్ డేటా సిస్టమ్, సూడో లైట్ సిస్టమ్, NavIC వంటి సెన్సార్‌లతో సహా మల్టీసెన్సర్ ఫ్యూజన్‌ను ఉపయోగించారు. అప్రోచ్, యు ల్యాండింగ్ ఇంటర్‌ఫేస్ , హై-స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులు వెహికల్ తిరిగి వచ్చేందుకు సహకరించాయని ఇస్రో తెలిపింది. ఇప్పుడు ఆర్బిటల్ పునర్వినియోగ వెహికల్ అయిన RLV-ORVలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పనిచేస్తు్న్నట్లు ఇస్రో తెలిపింది.