Israel, Iran War: దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి..ఎనిమిది మంది మృతి, 25 మందికి గాయాలు

గాజా, లెబనాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్య దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ బలగాలు మరోసారి దాడి చేశాయి. దక్షిణ లెబనాన్ లోని సిడాన్ పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఎనిమింది మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.  నగరంలోని హారెట్ సైదా ప్రాంతాల్లో ఆదివారం ( అక్టోబర్ 27) ఈ దాడి జరిగిందని లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్త తెలిపింది. 

మరోవైపు ఆదివారం ఉదయం ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 40 మంది మృతిచెందారు.80 మంది గాయపడ్డారు. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ హాస్పిటల్ పై శనివారం ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. 30 మంది వైద్య సిబ్బందిని బందీగా పట్టుకున్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
మధ్యధరా తీరంలోని సిడాన్..లెబనాన్ లోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఇది టైర్, బీరూట్ మధ్య ఉంటుంది. అక్టోబర్ 1న లెబనాన్ లో భూతల దాడులు ప్రారంభిం చి న ఇజ్రాయెల్.. అంచలంచెలుగా దాడులు చేస్తోంది. 

గత నెల రోజులుగా హుజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. వైమానిక, భూతల బలగాలతో లెబనాన్ లో కీలక ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో దాదాపు 18వందల మంది పౌరులు చనిపోయినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. పది లక్షలమంది లెబనాన్ ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది.

గడిచిన రెండు వారాల్లో ఇజ్రాయెలీ సైన్యం రెండు గ్రూపులుగా విడిపోయి హిజ్బుల్లా ప్రధాన మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్, హిజ్బుల్లా కు చెందిన కీలక నేతలను హతమార్చింది.

మరోవైపు కాల్పుల విరమణకు ఆదివారం పునఃప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత ఇవి మొదటి ఉన్నత స్థాయి చర్చలు. హమాస్ నాయకుడు యాహ్యా సిన్వా ర్ హత్య తర్వాత కాల్పుల విరమణకు US పిలుపునిచ్చింది.