గాజాలో ఇండ్లపై ఇజ్రాయెల్ దాడి..80 మంది మృతి..మృతుల్లో 54 మంది చిన్నారులు

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ( నవంబర్2) ఉత్తర గాజాలోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది చిన్నారులతో సహా 84 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు గాజా వర్గాలు వెల్లడించాయి. 

అక్టోబర్ 7, 2023 న హమాస్ దాడుల్లో 1139 మంది మరణించిన ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 43వేల 259 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. లక్ష మందికి పైగా గాయపడ్డారు.  200 మంది బందీగా తీసుకెళ్లారు. 

మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు మూడే వేల మంది చనిపోయారు. 13వేల 150 మంది గాయపడ్డారు. గడిచిన 24 గంటల్లో లెబనాన్ లో 30 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్య శాఖ తెలిపింది.