హెజ్బొ ల్లాతో కాల్పుల విరమణకు ఓకే

  • సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన నెతన్యాహు 

జెరుసలేం: హెజ్బొల్లాతో ఇజ్రాయెల్  కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోనుంది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్  ప్రధాని బెంజమిన్  నెతన్యాహు సూత్రపాయంగా ఆమోదం తెలిపారని ఇజ్రాయెల్  అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాకు ఇజ్రాయెల్  దౌత్యవేత్త మైక్  హెర్జాగ్  కూడా ఇజ్రాయెల్   ఆర్మీ రేడియోలో సోమవారం ఈ విషయం తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కొన్ని అంశాలపై తేల్చాల్సి ఉందని, కొన్ని రోజుల్లోనే అది జరుగుతుందని ఆయన చెప్పారు.

అయితే.. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. హెజ్బొల్లాపై తగిన రీతిలో స్పందించే హక్కు తమకు ఇవ్వాలని ఇజ్రాయెల్  డిమాండ్  చేస్తున్నది. ఈ ఒప్పందం ప్రకారం.. దక్షిణ లెబనాన్  నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్  వెళ్లిపోవాలి. కాగా.. హెజ్బొల్లాకు మద్దతు ఇస్తున్న లెబనాన్  ఈ ఒప్పందానికి ఒప్పుకుంటుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.