నిమిషానికో బాంబు.. 48 గంటలు ఆగకుండా మిసైల్స్.. సిరియాలో యుద్ధ బీభత్సం ఇలా..!

సిరియా: సిరియాలో యుద్ధ బీభత్సం ఇప్పటిలో ముగిసేలా లేదు. సెకనుకో ఎయిర్ స్ట్రైక్.. నిమిషానికో బాంబు.. అన్నట్లుగా ఉంది పరిస్థితి. 48 గంటలు ఆగకుండా మిసైల్స్ విరుచుకుపడుతూనే ఉన్నాయి. సిరియాలో యుద్ధ బీభత్సం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిరంకుశ ప్రభుత్వం కూలిపోయింది.. స్వేచ్ఛా గాలులు పీల్చుదాం అనుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రజలకు బాంబుల మోతలు దడ పుట్టిస్తున్నాయి.

మాజీ అధ్యక్షుడు బసర్ అల్ అసద్ దేశాన్ని వదిలి పారిపోవడంతో వివిధ దేశాలలో తలదాచుకున్న బాధితులు తిరిగి తమ సొత దేశానికి చేరుకుంటున్నారు. తిరుగుబాటు దారులు దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదేశంపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. కేవలం 48 గంటల్లో 480 దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 

Also Read :- మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు.. అంగీకరించిన బంగ్లా ప్రభుత్వం

సిరియాలో ఉన్న ఆయుధ ఉత్పత్తి స్థలాలను, 15 నావెల్ వెజెల్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ దాడిపై  సిరియా తాత్కాలిక ప్రధాని మహమ్మద్ అల్---- బషర్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సిరియాకు కావాల్సింది శాంతి, స్థిరత్వం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని అధికారుల సహకారంతో సిరియాను సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు.

  • స్వదేశానికి 77 మంది భారతీయులు:

మరోవైపు సిరియాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే పనిలో పడింది భారత విదేశాంగ శాఖ. అందులో భాగంగా 77 మంది భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తరలిస్తున్నట్లు పేర్కొంది. సిరియాలో ఉన్న భారతీయుల అభ్యర్తన మేరకు.. డమాస్కస్, బీరుట్ లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలు భారతీయులను భారీ భద్రత మధ్య దేశానికి తరలించే ప్రయత్నం చేశారు.