Irael, Gaza conflict: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బాంబుల దాడి..73 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం (అక్టోబర్ 20,2024) ఉత్తర గాజాలోని బెయిల్ లాహియాలోని బీరూట్ లో ఇజ్రాయెల్ సైన్యం మిస్సైల్స్ తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 73 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున లెబనాన్ క్యాపిటల్ బీరూట్ పై రెండు వైమానిక దాడులు జరిగాయి. దక్షిణ గాజా స్ట్రిప్ లో ఆక్స్ ఫామ్ ఇజ్రాకెట్ దాడిలో ఖాన్ యూనిస్ సమీపంలో నలుగురు ఇంజనీర్లు , కార్మికులు చనిపోయారు. 

అక్టోబర్ 7, 2023 హమాస్ దాడుల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 42వేల మంది మరణించారు. దాదాపు లక్ష మంది గాయపడ్డారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడుల్లో 1139 మంది చనిపోయారు. 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు.