అమర్​నాథ్ యాత్రపై దాడికి ఐఎస్ఐ కుట్ర

  • ఖలిస్తానీ టెర్రర్ గ్రూపు బబ్బర్ ఖల్సాతో కలిసి ప్రయత్నాలు

న్యూఢిల్లీ: అమర్ నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఖలిస్తానీ టెర్రర్ గ్రూపుతో కలిసి పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. యాత్రకు వచ్చే భక్తులు, పంజాబ్, ఢిల్లీలోని బీజేపీ నేతలు, హిందూ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడానికి ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సాను ఐఎస్ఐ ఉపయోగించుకుంటోందని చెప్పారు. 

కాగా, పఠాన్ కోట్ సమీపంలోని గ్రామంలో ఏడుగురు అనుమానిత టెర్రరిస్టులు  దొరకడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో పంజాబ్ లోని హిందూ మత గురువుకు ఖలిస్తాన్ గ్రూపు నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ లేఖ వెనుక ఉన్న నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్  మొదలుపెట్టారు.