Pi Phone: డిసెంబర్లో టెస్లా Pi స్మార్ట్‌ఫోన్‌ లాంచ్..! ఇంటర్నెట్, ఛార్జింగ్ అవసరం లేదట

ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలలో ఎందులో చూసినా ఇదే న్యూస్..ఎలాన్ మస్క్ కొత్త ఫోన్ గురించి..ఈ డివైజ్ సెల్ ఫోన్ ఇండస్ట్రీలో ఓ సంచలనం..   సృష్టించబోతోంది అని..సెల్ ఫోన్ చరిత్రలో ఎన్నడూ చూడని ఫీచర్లతో ఈ శతాబ్ధంలో టెక్ రంగంలో పెద్ద విప్లవాన్ని  తెస్తుందని.. కార్ల ఉత్పత్తిలో పయనీర్ అయిన ఎలాన్ మస్క్ కంపెనీ Pi ఫోన్ ను ఈ ఏడాది 2024లో లాంచ్ చేస్తుందని ఇంటర్నెట్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ నిజంగా ఎలాన్ మస్క్ అలాంటి ఫోన్ లాంచ్ చేస్తున్నారా.. 

ఎప్పుడూ సంచలన నిర్ణయాలతో వార్తల్లో ఉండే మస్క్.. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పుడు ఇంటర్నెట్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాడు.. తర్వాత టెస్లా సీఈవో గా, స్పేస్ ట్రావెల్ , శాటిలైట్ టెక్నాలజీకే కొత్త అర్థం చెప్పిన Space X వ్యవస్థాపకుడిగా ఎలాన్ మస్క్ డైనమిక్ ఎంట్రాపీనర్ గా చెప్పొచ్చు.

 మస్క్ తాజాగా సెల్ ఫోన్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించేందుకు Pi స్మార్ట్ ఫోన్ ను వస్తుందని అందరూ భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎలాన్ మస్క్ Pi ఫోన్ గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. Pi ఫోన్ చుట్టే పుకార్లు షికార్లు చేస్తు్న్నాయి. 

ALSO READ | Pi Phone: టెస్లా Pi స్మార్ట్‌ఫోన్‌..ఇంటర్నెట్, ఛార్జింగ్ అవసరం లేదట.. ఇందులో నిజమెంత

టెస్లా Pi స్మార్ట్ ఫోన్..మూడు ఎక్స్ ట్రార్డినరీ ఫీచర్లతో వస్తుందని నెట్టింట రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు ఇదే చెబుతున్నాయి. 

మొదటి ఫీచర్ .. టెస్లా ఫోన్  కు ఇంటర్నట్ అవసరం లేదు.. SpaceX స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ కనెక్టివిటీతో వస్తుందని అంచనా వేస్తున్నారు.  
రెండో ఫీచర్.. టెస్లా స్మార్ట్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరంలేదు.. ఇది సోలార్ సిస్టమ్ తో దానంతటే అదే ఛార్జింగ్ చేసుకుంటుందట
మూడో ఫీచర్.. టెస్లా స్మార్ట్ ఫోన్ ద్వారా గ్రహాంతర కనెక్టికవిటీ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మరి వాస్తవమేంటీ.. 

టెస్లా స్మార్ట్ ఫోన్ గురించి ది వెర్ట్, టెక్ క్రంచ్, CNET వంటి ప్రధాన అవుట్ లెట్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు.  మరోవైపు టెస్లా నుంచి బ్రాండెడ్  స్మార్ట్ ఫోన్ విడుదల గురించి టెస్లా గానీ, సీఈవో ఎలాన్ మస్క్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు.

2021 నుంచి టెస్లా పై ఫోన్ గురించి పుకార్లు ఉన్నప్పటికీ ఈ పుకార్లు టెస్లా ద్వారా ధృవీకరించదగిన ప్రకటనల కంటే ఎక్కువగా టెస్లా అభిమానుల నుంచి రూమర్స్ ద్వారా ఈ వార్తలు స్ర్పెడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. 

దీనికి తోడు ఎలాన్ మస్క్ తన X పోస్ట్ లో స్మార్ట్ ఫోన్ అభివృద్ది చేడయంలో తనకు ఎలాంటి ఆసక్తి లేదని గతంలో నే చెప్పారు.