పప్పు దినుసుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే... ప్రతి రోజు పప్పు తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుందట. అంతేకాదు గుండె జబ్బులు కూడా రావట.
నిత్యం పప్పు దినుసులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వును కరిగించుకోవచ్చని... తద్వారా గుండె జబ్బులు రావని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో తేలింది. పప్పు దినుసుల వల్ల రక్త నాళాల్లో పేరుకునే కొవ్వు కరుగుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి.. పప్పు దినుసులను కచ్చితంగా రోజుల తినాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.