ఇరాన్ సత్తాను చూపాలి: ఖమేనీ

టెహ్రాన్​: తమ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ జరిపిన ఎయిర్​ స్ట్రైక్​పై ఇరాన్ సుప్రీం లీడర్​ ఆయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. రెండు రోజులుగా ఇజ్రాయెల్​ జరిపిన దారుణ చర్యలను తక్కువ చేసి చూడొద్దని, అదే సమయంలో  అతిగా భావించొద్దని అన్నారు. ఇజ్రాయెల్​కు ఇరాన్  సత్తాను చూపించాలని తెలిపారు.   దీనిపై ఎలా స్పందించాలనేది అధికారులే నిర్ణయిస్తారని ఖమేనీ చెప్పినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.