ఇరానీ టీ ఇంట్లోనే..తయారు చేసుకోండి ఇలా

హైదరాబాద్​లో ఉండే వాళ్లు ఒక్కసారైనా ఈ టీ టేస్ట్ చేసే ఉంటారు. మరి ఇంత ఫేమస్​ అయిన ఇరానీ చాయ్​ టేస్ట్ చేయాలంటే కేఫ్​​లకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇరానీ టీని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. కాకపోతే  కాస్త టైం, మరికాస్త ఓపిక ఉండాలి. దాన్ని ఎలా ప్రిపేర్​ చేయాలంటే...

కావాల్సినవి : 

పాలు - అర లీటర్​
కండెన్స్​డ్​ మిల్క్​ - ఒక టేబుల్​ స్పూన్​
యాలకుల పొడి -  పావు టీ స్పూన్​
టీ పొడి - మూడు టేబుల్​ స్పూన్లు
చక్కెర - రెండు  టేబుల్​ స్పూన్లు
నీరు - రెండు కప్పులు

తయారీ : టీ గిన్నెలో నీళ్లు పోసి, టీ పొడి, చక్కెర, యాలకుల పొడి వేయాలి. గిన్నె పై భాగంలో అంచులను గోధుమపిండి లేదా క్లాత్​తో సీల్​ చేసేయాలి. అచ్చం దమ్​ బిర్యానీకి దమ్​ పెట్టినట్టే. ఇలా సీల్​ చేయడం వల్ల డికాక్షన్​ మరుగుతున్నప్పుడు ఆవిరి బయటకు పోదు. అలా సన్నని మంట మీద బాగా మరిగించాలి. ఇంకో స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని అందులో పాలు పోసి, కండెన్స్​డ్​ మిల్క్​ వేసి బాగా మరిగించాలి. డికాక్షన్​ రెడీ అయ్యాక కావాల్సినంత డికాక్షన్​ను జల్లెడతో టీ కప్పులో​ పోయాలి. ఆ తర్వాత ఆ డికాషన్​లో పాలు పోయాలి. అంతే.. ఘుమఘుమలాడే ఇరానీ చాయ్ టేస్ట్ రెడీ అవుతుంది.

స్పెషాలిటీ

ఇరానీ చాయ్ అనగానే.. దాని ప్రత్యేకమైన రుచి, వాసన మాత్రమే కాదు.. సర్వింగ్ స్టయిల్ కూడా గుర్తొస్తుంది. మామూలుగా అయితే చాయ్ గ్లాస్, పేపర్​ కప్స్​లో తాగుతారు. కానీ, ఇరానీ చాయ్ మాత్రం పింగాణీ కప్​లోనే సర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఇంట్లో చేసుకున్నా అలాంటి కప్పుల్లో పోసుకుని తాగితే బాగుంటుంది. 

హెల్త్ బెనిఫిట్స్

ప్రపంచంలోనే అత్యంత హెల్దీ అయిన టీ ఏదంటే ఇరానియన్ టీ. పర్షియన్ బెస్ట్ డ్రింక్స్​లో ఇదొకటి. పర్షియన్​ టీ ఆకుల్లో ఎక్కువగా వాడేది బ్లాక్ టీ. ఇందులో ఉండే కెఫిన్, టానిన్ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. కిడ్నీలలో రక్తప్రసరణ పెరుగుతుంది. గుండె కండరాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె కొట్టుకునే వేగం అదుపులో ఉంటుంది. బీపీని తగ్గిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.

టేస్టీ టిప్స్ :

  •    ఫుల్ క్రీమ్ మిల్క్ లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా గేదె పాలను వాడితే రుచిగా ఉంటుంది.
  •     కండెన్స్‌‌డ్ మిల్క్ , క్రీమ్ లేదా ఖోయా/మావాను ఉపయోగించడం వల్ల చాయ్‌‌కి క్రీమీ ఫ్లేవర్ వస్తుంది. 
  •     డికాక్షన్​, పాలను ఎంత ఎక్కువ సేపు మరిగిస్తే చాయ్​కి అంత టేస్ట్​ వస్తుంది.
  •     ఆవిరిపోకుండా తయారుచేస్తారు కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. 
  •     చాయ్​పత్తా ఎంత క్వాలిటీది అయితే ఇరానీ చాయ్ రుచి అంత ఎక్కువగా ఉంటుంది. ఇరానీ టీ కోసం బ్లాక్ టీ పొడి వాడడం ఫేమస్.