ఇజ్రాయెల్‎ ఆటలు ఇక సాగవు.. ఇరాన్ అమ్ములపొదిలో బ్రహ్మాండమైన అస్త్రం

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర బాంబ్, రాకెట్లు, మిసైళ్ల దాడులతో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణ నెలకొంది. ఒక దేశంపై మరో దేశం బాంబుల వర్షం కురిపించుకుంటుండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత తీవ్రమైన వేళ ఇరాన్ తమ సైనిక సంపత్తిని మెరుగుపర్చకోవడంపైన ఫోకస్ పెట్టింది. 

ఇందులో భాగంగానే ఇరాన్ తమ రక్షణ దళాల్లోకి అత్యాధునాతన క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టింది. వాయు రంగంలో శత్రువుల దాడులను తిప్పికొట్టడంతో పాటు.. రివర్స్ ఎటాక్ చేయడం కోసం ఇరాన్ స్వదేశీ AD-40 క్షిపణి వ్యవస్థ అభివృద్ధి చేసుకుంది. మధ్యస్థ-శ్రేణి AD-40 క్షిపణి వ్యవస్థతో ప్రాంతీయ వాయు రక్షణ సాంకేతికతలో ఇరాన్ కు‎ బలం మరింత పెరగనుంది. ఇరాన్ తాజాగా అభివృద్ధి చేసుకున్న AD-40 క్షిపణి వ్యవస్థ.. వైమానిక లక్ష్యాలను గుర్తించి టార్గెట్ చేయడంతో పాటు.. ప్రత్యర్థులను అడ్డగించడంలో సమర్థవంతంగా పని చేయనుంది. 

AD-40 క్షిపణి వ్యవస్థ సామర్థ్యాలు:

అధునాతన రాడార్, ట్రాకింగ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ AD-40 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగలదు. 74 కిలోల వార్‌హెడ్‎ను మోసుకెళ్లి అత్యంత కచ్చిత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.  AD-40 క్షిపణి గరిష్ట పరిధి 40 కి.మీ. 18 కి.మీ ఎత్తుకు చేరుకోగలదు.  AD-40 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ట్రాకింగ్, గైడెన్స్ సిస్టమ్‌లు తక్కువ- సిగ్నేచర్ డ్రోన్‌లు, స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్, హై-స్పీడ్ క్షిపణులను గుర్తించి ప్రత్యర్థుల ముప్పు నుండి కాపాడగలదు.

 ఇజ్రాయెల్‎తో పోరు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ సమయంలో AD-40 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ బలగాలకు బ్రహ్మస్త్రంగా పనిచేయనుంది. శత్రువుల నుండి వచ్చే ముప్పును గుర్తించడంతో పాటు అత్యంత వేగంగా కౌంటర్ ఎటాక్ చేసేలా D-40 క్షిపణి వ్యవస్థ డిజైన్ చేశారు. AD-40 క్షిపణి వ్యవస్థ ఇరాన్ బలగాలను మరింత పటిష్టం చేయడంతో పాటు.. ఇజ్రాయెల్ దాడులను,  వైమానిక బెదిరింపులను ధీటుగా ఎదుర్కొవడానికి ఇరాన్‎కు ఎంతో ఉపయోగపడుతోంది.