IPPBలో 344 బ్యాంక్ ఉద్యోగాలు : డిగ్రీ ఉంటే చాలు.. ఎగ్జామ్ లేదు

నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 344 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వారు అర్హులు.. గ్రామీణ్ డాక్ సేవక్ గా కనీసం రెండేళ్లు పనిచేసి ఉండాలి. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యరులను సెలక్ట్ చేస్తారు. లేదా బ్యాంక్  ఆన్‌లైన్‌లో టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయవచ్చు. అది ఆయా ప్రాంతీయ బ్యాంకుల ఇష్టం. నెలకు రూ.30 సాలరీ ఉంటుంది.

ALSO READ : ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

అభ్యర్థులు 2024 సెప్టెంబర్ 1నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఏజ్ ఉండాలి. ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ లో 8 పోస్టులు, తెలంగాణలో15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 11 నుంచి అప్లికేషన్లు ఆన్ లైన్ ద్వారా స్వీకరించనున్నారు. అప్లికేషన్ ఫీజు రూ.750 ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. ఇది నాన్ రీఫండబుల్. ippbonline.com అఫిషియల్ వెబ్ సైట్ లో అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.