ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితాను శుక్రవారం (నవంబర్ 15) ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది. ఈ జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ప్రారంభమవుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది.
574 మంది ఆటగాళ్లలో 366 మంది భారతీయులు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. ముగ్గురు అసోసియేట్ ఆటగాళ్లు ఉన్నారు. 366 మంది భారత ఆటగాళ్లలో 318 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక 208 మంది విదేశీ ఆటగాళ్లలో 12 మంది అన్‌క్యాప్‌డ్ కేటగిరిలో ఉన్నారు. 81 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల అత్యధిక ధరతో వేలంలో పాల్గొననున్నారు.
జోస్ బట్లర్ , శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబడ , అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ మార్క్యూ సెట్ 1లో ఉండగా.. యుజ్వేంద్ర చాహల్ , లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కెఎల్ రాహుల్ , మహ్మద్ షమీ,మహ్మద్ సిరాజ్ మార్క్యూ సెట్ 2లో ఉన్నారు. 2018 వేలం తర్వాత ఆటగాళ్ల మార్క్యూ జాబితాను రెండుగా విభజించడం ఇదే తొలిసారి. శ్రేయాస్ అయ్యర్,
వేలం అబాడి అల్ జోహార్ అరేనా వేదికగా జరగనుండగా.. ఫ్రాంచైజీల యజమానులు, అధికారులు హోటల్ షాంగ్రి-లాలో బస చేయనున్నారు. కాగా, ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను వెల్లడించాయి. మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోగా, ఇందులో పది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిపై అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.558.5 కోట్లు ఖర్చు చేశాయి.
? IPL MEGA AUCTION KICKS OFF 1PM FROM 24TH NOVEMBER. ?
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2024
Set 1 - Buttler, Shreyas, Pant, Rabada, Arshdeep & Starc.
Set 2 - Chahal, Livingstone, Miller, KL Rahul, Shami & Siraj.
Set 3 - Brook, Conway, Fraser-McGurk, Markram, Padikkal, Tripathi & Warner. pic.twitter.com/YTbBZDbhJD